BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మార్చాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
16 Mar, 2026 - 10:51 AM
215 వీక్షణలు

ప్రజా వైద్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్

ప్రారంభమైన సిపిఎం నిర్వహిక నిరాహార దీక్షలు

 రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో 40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు ముందు ప్రారంభించడం జరిగింది. సిపిఎం మండల నాయకులు 8 మంది నిర్వహిక దీక్షలో కూర్చోగా వారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంపీ జహంగీర్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లేక అశోక్ రెడ్డి పూలమాలవేసి దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక వస్తు లేక ఈ ప్రాంత ప్రజలకు ప్రజా వైద్యం అందకుండా పోతుందని అత్యవసర పరిస్థితి వస్తే దూరప్రాంతాలకు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని నియోజకవర్గ కేంద్రంగా 8 మండలాల గ్రామాల ప్రజలకు 56 సంవత్సరాల నుండి వైద్య సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రి నేడు పరిమితమైన పాత భవనంలో ఎప్పుడు కోలుతుందో తెలియని ప్రమాద పంచుల్లో ఉందన్నారు. ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టి 10 సంవత్సరాలు గడుస్తున్న ఆచరణకు నోచుకోలేదని 50 పడకల కోసం అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శిలాఫలకం వేసి మూడు సంవత్సరాలు గడుస్తున్న కనీసం నిధులు రాక దుర్భర పరిస్థితిలో ఉందని అన్నారు.ఈ ప్రభుత్వాసుపత్రి ప్రధమ చికిత్స, పోస్టుమార్టంలకే పరిమితమైంది తప్ప పేదలకు వైద్యం ఉండడం లేదని వాపోయారు ప్రతిరోజు 400 మంది అవుట్ పేషెంట్లు వైద్యం కోసం వస్తారని రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, ప్రాంత ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది అన్నారు. గర్భిణీ స్త్రీలకు కనీసం స్కానింగ్ లేకపోవడంతో ప్రతిసారి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వంద పడకల నూతన భవనం నిర్మించి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై స్పష్టమైన ప్రకటన చేసేదాకా నిరాహార దీక్షలకు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

*నిరవదిక నిరాహార దీక్షలో కూర్చున్న నాయకులు సిపిఎం*


 జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జలల పెంటయ్య మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర నరసింహ చారి కందుల హనుమంతు మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు నాగటి ఉపేందర్ వేముల సైదులు చానకొండ రాము మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. 

ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ  నాయకులు ఫజల్ బేగ్, నకిరేకంటి గణేష్,దండగుల రాములు,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గాజుల ఆంజనేయులుసంఘీభావం తెలిపారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్,కల్లూరి నగేష్, జంపాల అండాలు మండల నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్,నీల అయిలయ్య, ఎండీ రషీద్,గాదె నరేందర్, ఆవనగంటి నగేష్, బొడిగె రజిత, తొలుపునూరి శ్రీనివాస్,మేడి గణేష్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్,తాళ్లపల్లి జితేందర్, పులిబిక్షం, గుండాల ప్రసాద్, గోగు లింగస్వామి, కొమ్ము అంజమ్మ,కూనూరు మల్లేశం,గన్నేబోయిన శ్రీనివాస్, ఆవనగంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.