BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 May 2026, 04:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:29 PM
220 వీక్షణలు

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ చాట్రాయిలో రైతులకు అవగాహన కార్యక్రమం

చాట్రాయి, 16-05-2026:

వ్యవసాయ శాఖ రూపొందించిన APAIMS ఫార్మర్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు వరి సాగులో వివిధ యాజమాన్య పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్ అంశాలు, వాతావరణ హెచ్చరికలు, పంటలపై చీడపీడలను గుర్తించే విధానం, నీటి లభ్యత వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

పంట సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. రైతు సేవ కేంద్రాల్లోని VAA, VHAలను సంప్రదిస్తే యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి రైతు APAIMS యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే సందర్భంగా చాట్రాయి మండల రైతులకు అవసరమైన జీలుగా, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను రైతు సేవ కేంద్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు 50 శాతం రాయితీపై పొందాలని కోరారు.

చాట్రాయి గ్రామంలో రైతులకు APAIMS ఫార్మర్ యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.