BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 12 June 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రిజర్వేషన్లపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సిద్ధం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 07:42 PM
120 వీక్షణలు

న్యూఢిల్లీ, జూన్ 12: మతం మారిన దళితుల రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో దళిత క్రైస్తవ, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పన, అలాగే మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా ఇవ్వాలా అనే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసినది. త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేయనున్నారు.

కమిషన్ నాలుగేళ్ల పాటు వివిధ రంగాలలో సుదీర్ఘ పరిశీలనచేసింది. ప్రజల్లోని అనుభవాలను, సామాజిక వివక్షను పరిశీలించి నివేదికలో ప్రస్తావన చేశారు. జూన్ 10తో కమిషన్ గడువు ముగిసింది, కానీ కేంద్రం మరో 10 రోజులపాటు పొడిగించింది.

1950లో ఆమోదించబడిన రాజ్యాంగం ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఉంది. దీన్నప్పటికీ ముస్లిం, క్రైస్తవ మతాల్లోని దళితులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కుల వ్యవస్థ లేదని కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఈ మతాల్లో చేరిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ నేపథ్యంలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ సిఫార్సులు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమయ్యాయి.