BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 08:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్నారా..? 2027 నుంచి కొత్త నిబంధనలు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 08:16 AM
105 వీక్షణలు

 సైబర్ మోసాల బాధితులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కొత్త పరిహార విధానాన్ని తీసుకురానుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, డిజిటల్ మోసాల్లో రూ.50 వేల లోపు నష్టం జరిగిన వారికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు లేదా నష్టపోయిన మొత్తంలో 85 శాతం వరకు పరిహారం అందించే అవకాశం ఉంది.

అయితే ఈ సౌకర్యం పొందాలంటే బాధితులు మోసం జరిగిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన తర్వాత అర్హులైన వారికి పరిహారం అందజేయనున్నారు.

ఇక కస్టమర్ ఎలాంటి ఓటీపీ, పాస్‌వర్డ్ లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే ఖాతా నుంచి డబ్బులు మాయమైతే, ఆ నష్టానికి బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అయితే లక్షల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు ఎలాంటి పరిహారం అందిస్తారనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై ఆర్బీఐ నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.

 గుర్తుంచుకోండి: సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయడం, వెంటనే ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.