BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 08:39 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

సఖి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Mar, 2026 - 08:39 AM
166 వీక్షణలు

సఖి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళల భద్రత,సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు.గురువారం రోజున హౌసింగ్ బోర్డ్ లో గల సఖీ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. సఖీ సెంటర్ లో ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో అందిస్తున్న సేవలను పరిశీలించి, బాధిత మహిళలకు అందుతున్న సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖీ సెంటర్ కి ఎలాంటి కేసులువస్తున్నాయని, వచ్చిన కేసులకు ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సఖి సెంటర్ కీలక పాత్ర పోషించాలన్నారు.సఖి సెంటర్‌లో మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్,  అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించే విధంగా సిబ్బంది పనిచేయాలని అన్నారు.అనంతరం  మాస్ కుంట లో నూతనంగా నిర్మాణం లో ఉన్న సఖి భవనాన్ని కలెక్టర్ సందర్శించి పెండింగ్ లో ఉన్న  పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్  అధికారులను ఆదేశించారు. తర్వాత సింగన్న గూడెంలో నిర్మాణంలో ఉన్న బాల సదనం భవనాన్ని సందర్శించి. పెండింగ్ పనుల అతి త్వరగా పూర్తిచేయించాలని.TSEWIDC డీఈని  ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.