BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 04:42 am
Posted by : కూనురు మధు

సమ్మెలో సిబ్బంది.. రంగంలోకి సర్పంచ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
17 Mar, 2026 - 04:42 AM
348 వీక్షణలు

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నీ బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ అరుదైన రీతిలో స్పందించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ఐదు నెలలుగా అందని జీతాలు

​గత ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు. చివరికి పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కూడా జీతం రాక పని మానేయడంతో గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం క్షీణించి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గమనించిన సర్పంచ్, అధికారుల కోసం వేచి చూడకుండా స్వయంగా రంగంలోకి దిగారు. పదవిలో ఉన్నామన్న అహంకారం లేకుండా గ్రామం కోసం సర్పంచ్ పడుతున్న శ్రమ ఆదర్శప్రాయం" అని స్థానికులు కొనియాడారు.​సర్పంచ్ చొరవను అభినందిస్తూనే, మరోవైపు పంచాయతీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి, పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, తద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.