BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 January 2026, 06:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు

తెలంగాణ
13 Jan, 2026 - 06:06 AM
225 వీక్షణలు

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు

ముగ్గుల, క్రీడా పోటీల్లో పాల్గొన్న లోకేష్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. ఈ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సన్మానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి అతిథులు గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, భరత్, నారా రోహిత్, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, అనిమిని రవినాయుడు తదితరులు హాజరయ్యారు. #SankrantiCelebrations #Naravaripalle #NaraLokesh #StudentSports #CulturalEvents #AndhraPradeshNews #LocalNews #FestivalVibes Follow us on Website Facebook Instagram YouTube