BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 January 2026, 03:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

తెలంగాణ
11 Jan, 2026 - 03:16 AM
331 వీక్షణలు

కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆడపడుచులకు చీరల పంపిణీ

NTODAY NEWS: మంచిర్యాల నియోజకవర్గం కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను, సంక్రాంతి పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల మున్సిపాలిటీ వైశ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 8, 9, 21, 22, 23, 24, 33 వార్డులకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించగా, చీరల పంపిణీని ఆయన సతీమణి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్య కారణాల వల్ల బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేయలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయాలని సూచించారని చెప్పారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube