BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 05:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 05:54 AM
164 వీక్షణలు

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు అంశంపై వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పోలీసుల రూల్స్ ప్రకారమే బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

హై-ప్రొఫైల్ కేసుల్లో రాజకీయ ఒత్తిడి ఉంటుందనే ఆరోపణలు సహజమని పేర్కొన్న సీఎం, ఈ కేసులో విచారణాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఎంపీకి బెయిల్ లభించడం చట్టపరమైన ప్రక్రియలో భాగమే తప్ప, రాజకీయ జోక్యం లేదని చెప్పారు. దీంతో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముందుగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

సిట్ తన పని తాను చేసుకుంటుందని, విచారణలో ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. డీజీపీ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు. కేవలం ఫామ్‌హౌస్ దాడికి పరిమితం కాకుండా డ్రగ్స్ మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేసులు నీరుగారిపోయాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిందితులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.