BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 May 2026, 05:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్వీడన్ అత్యున్నత పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 05:34 PM
158 వీక్షణలు

స్టాక్‌హోమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన “రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్”లోని “కమాండర్ గ్రాండ్ క్రాస్” బిరుదుతో మోదీని సత్కరించింది. విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు స్వీడన్ అందించే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

భారత్–స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య మరియు సాంకేతిక సహకార విస్తరణలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు స్వీడన్ ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను మరింత పెంచుతున్న మోదీకి లభించిన ఇది 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషంగా మారింది.

స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడి ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో వాణిజ్యం, హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.