BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 13 February 2026, 08:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు

తెలంగాణ
13 Feb, 2026 - 08:21 AM
182 వీక్షణలు
మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి,  జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (144) అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియమావళి (MCC) ప్రకారం జిల్లాలో కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరగేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఏ ప్రజా లేదా ప్రైవేట్ ప్రదేశంలో ముగ్గురికి మించి వ్యక్తులు గుమికూడరాదని స్పష్టం చేశారు. అనధికార సమావేశాలు, శిబిరాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ వాహనాలు లేదా టూర్ వాహనాల ద్వారా అనుమతి లేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికల నియమాలను గౌరవించి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. #YadadriBhuvanagiri #MunicipalElections #Section163 #BNSS #ElectionCommission #TelanganaNews #LawAndOrder #MCC Follow us on Website Facebook Instagram YouTube