BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 07:37 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 07:37 PM
146 వీక్షణలు

శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

 తేది:  01.04.2026

శ్రీ స్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సాయంకాలాన స్వామిఅమ్మవార్లకు విశేషంగా ధూపాన్ని సమర్పించడం ( దవనోత్సవం)   సంప్రదాయం.

చైత్రపౌర్ణమి సందర్భంగా బుధవారం (01.04.2026) సాయంకాలం ఈ ధూపసమర్పణ జరిపించబడింది.  

ఈ కార్యక్రమములో సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురానికి ఎదురుగా అగ్నిప్రతిష్ఠాపన చేసి ఆజ్యం, దవనం, గుగ్గిలం ఆహుతిగా వేసి శ్రీస్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ చేయబడింది.

ఈ సమర్పణలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత శాస్త్రోక్తంగా అగ్నిప్రతిష్ఠాపనాది కార్యక్రమాలు జరిపి ధూపసమర్పణ జరిపించబడింది. 

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  తదితరులు పాల్గొన్నారు.

కాగా ప్రతి సంవత్సరం ఈ ధూపసమర్పణలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ