BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 27 March 2026, 04:13 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీరామచద్రులవారికి పట్టువస్త్రాలు సమర్పించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 04:13 PM
176 వీక్షణలు

శ్రీరామచద్రులవారికి పట్టువస్త్రాలు సమర్పించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి 

న్యూ ఢిల్లీలో శ్రీ సీతారామ చంద్రమూర్తికి పట్టువస్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

శ్రీరామ నవమిని పురస్కరించుకొని న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో మందిర్ మార్గ్, గోల్ మార్కెట్,  పోలీస్ కాలనీలో చైత్ర మాస శుక్ల పక్షం నవమి తిథినాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిత్ లగ్నంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతా రాముల కళ్యాణం ఢిల్లీలోని తెలుగు పూజ సమితి ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో వైభవంగా  నిర్వహించారు. 


ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి శ్రీ సీతా రాములవారికి పట్టు వస్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి వార్ల కళ్యాణం అనంతరం బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముల వారి చరిత్ర, నమ్మిన ఉంటూ ఆంజనేయ స్వామి లేకుండా ఉన్న, సీతాదేవి శ్రీ రామచంద్ర మూర్తి విడిపోకముందు నిర్మాణం జరిగి ఒకే శిలపై శ్రీరామ,  లక్ష్మణ,  సీతా దేవిలు దర్శనం ఇచ్చే పవిత్ర, పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం అన్నారు. శ్రీరామచంద్రమూర్తికి అత్యంత నమ్మిన భక్తురాలు శబరి అని ఆ మహా భక్తురాలి పేరు నా కూతురు కు పెట్టానని, ఆ బైరెడ్డి శబరి ప్రస్తుత నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు అని బైరెడ్డి వివరించారు. బైరెడ్డి శబరి ప్రతి ఏటా 44 కిలోమీటర్లు నల్లమల అభయారణ్యంలో కలనడకన శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుంటుందని, మార్గమధ్యలో అడవి బిడ్డలు ( చెంచుల) సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కారం కోసం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కృషి చేస్తుందన్నారు. 


2015 అక్టోబర్ 2 వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్చ భారత్ కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించారని, గత 30 ఏళ్లుగా ఢిల్లీ తెలుగు పూజ సమితి పేరుతో శ్రీరామనవమి రోజు శ్రీ సీతా రాములవార్ల కళ్యాణం, అన్న ప్రసాద వితరణ, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీరామచంద్రమూర్తి ఆదర్సాలు, ధర్మం, నీతిని స్మరించుకోవడం, భవిష్యత్ తరాలకు నిర్వాహకులు తెలియజేయడం అభినందనీయమని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ ప్రత్యేక పూజల్లో ఢిల్లీ రిటైర్డ్ ఎస్ ఐ శ్రీనివాస్, ఢిల్లీ తెలుగు పూజ సమితి, ఆంధ్ర వనిత మండలి ఢిల్లీ జనరల్ సెక్రటరీ  అనసూయ, మినిస్టర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ తోట. హనుమంతరావు, డి ఓ పి టీ డైరెక్టర్ ప్రసాద్ రావు, మినిస్టర్ ఆఫ్ స్టీల్ ఏ ఎస్ ఓ రామప్రసాద్, దుర్గా కళ్యాణం తదితరులు శ్రీ సీతారాముల కళ్యాణంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి వెంట పాల్గొన్నారు.