BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 28 March 2026, 02:25 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ ఎక్సఆఫీసియో కార్యదర్శి

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
28 Mar, 2026 - 02:25 PM
262 వీక్షణలు

శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన దేవాదాయ శాఖఎక్సఆఫీసియో కార్యదర్శి 

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  28.03.2026

దేవదాయశాఖ ఎక్స్ – అఫిషియో కార్యదర్శి డా. యం. హరిజవహర్‌లాల్  శనివారం  ( 28.03.2026)  ఆకస్మికంగా క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా కార్యదర్శి వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వేసవిలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ముఖ్యంగా భక్తులు  అధికసంఖ్యలో దర్శనం కోసం వేచివుండకుండా  త్వరగా దర్శనమయ్యేవిధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.  భక్తులకు దర్శనాలు కల్పించే విషయమై ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత విభాగాల అధికారులందరు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. 

 అవసరమైనచోట్ల చలువపందిర్లను వేయాలన్నారు. క్యూకాంప్లెక్సులోనూ, క్యూలైన్లలో నిరంతరం మంచినీటిని అందిస్తుండాలన్నారు.  ఇందుకోసమై స్వచ్ఛందసేవలను అందిస్తున్న శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు.  క్యూలైన్లలోని నిర్దిష్ట ప్రదేశాలలో ఏర్పాటు చేయబడిన వాటరు పాయింట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.   క్యూకాంప్లెక్సులో ఏర్పాటు చేయబడిన ఫ్యాన్లు, ఎయిరుకూలర్లు, వాటరు కూలర్లు సక్రమంగా పనిచేసే విధంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఎప్పుడైన మరమ్మతులు తలెత్తినప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 

అదేవిధముగా క్యూకాంప్లెక్స్‌లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు.  అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు. 

క్షేత్రంలో పారిశుద్ధ్యం నిర్వహణను కూడా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా వారు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్యదర్శి వారికి స్వామివార్ల ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేయబడ్డాయి. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ