BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 11:27 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం ధర్మకర్తలు మండలి సమావేశం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 11:27 PM
131 వీక్షణలు

శ్రీశైలం ధర్మకర్తలు మండలి సమావేశం 

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  25.03.2026


బుధవారం (25.03.2026) దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షన ధర్మకర్తల మండలి  5వ సమావేశం నిర్వహించబడింది. 

దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈనాటి సమావేశంలో మొత్తం 28 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 23 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా వాటిలో 4 అంశాలను వాయిదా వేయడం జరిగింది. ఒక అంశం తిరస్కరించబడింది.  

సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  శ్రీపోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. 


క్షేత్రంలో సందర్శించే సామాన్యభక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి సమావేశంలో కూలంకుషంగా చర్చించడం జరిగింది. 

క్షేత్రాభివృద్ధి మరియు సౌకర్యాల కల్పనకుగాను రాబోవు 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన  మాస్టర్‌ప్లాన్‌ తుదిరూపం ఇచ్చేందుకై నిర్ధారణకు డి.పి.ఆర్   ( DETAILED PROJECT REPORT) పరిశీలించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.  

ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాలకు సంబంధించి అనగా డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు మొదలైనవాటికి మొదటి ప్రాధాన్యతను మాస్టరుప్లానులో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 

అదేవిధంగా శ్రీశైలక్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా మాస్టర్ ప్లానులో పొందుపరచాలని నిర్ణయించడం జరిగింది.  

మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్ర సుందరీకరణకు కూడా తగు చర్యలు చేపట్టేవిధంగా ఆయా అంశాలను మాస్టరుప్లానులో పొందుపరిచేందుకు నిర్ణయం గైకొనబడింది.   

మల్లమ్మ కన్నీరు సమీపంలో గల పురాతన కాలభైరవ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. 

పరిపాలనాంశాలలో భాగంగా గో సంరక్షణశాలలోని గోవులకు గ్రాసాన్ని సరఫరా చేసేందుకు టెండర్లు  పిలిచేందుకు ఆమోదించడం జరిగింది. 

భక్తులకు అందజేసే కైలాసకంకణాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించేందుకు తీర్మానించడం జరిగింది. ఈ కైలాస కంకణాల రూపకల్పనకు ధర్మకర్తల మండలి ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌లో భాగంగా మురుగునీటిని శుద్ధి చేసేందుకై ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఆపరేషన్ చార్జీలకు సంబంధించి టెండర్లను పిలవాలని నిర్ణయించడం జరిగింది. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ