BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 March 2026, 06:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఫాలధార–పంచధార వద్ద విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

తెలంగాణ
07 Mar, 2026 - 06:56 AM
247 వీక్షణలు
మార్చి 8న ఫాలధార–పంచధార వద్ద విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం పరివార దేవాలయమైన ఫాలధార–పంచధార వద్ద ఈ నెల 8వ తేదీన శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి కరకమలాలచే నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 8 గంటలకు ఫాలధార–పంచధార వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో అధివాస హోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలన కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫాలధార–పంచధారలోని నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు మార్చి 6న ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, మండపారాధన, చతుర్వేద పారాయణం మరియు నూతన విగ్రహాలకు జలాధివాస కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం క్షీరాధివాసం మరియు అధివాస హోమాలు జరిపించారు. రెండవ రోజైన మార్చి 7న ఉదయం నూతన విగ్రహాలకు ధాన్యాధివాస కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం పుష్పాధివాసం, శయ్యాధివాసం మరియు అధివాస హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మార్చి 8న జరిగే విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమాలు ముగియనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. #Srisailam #Adishankaracharya #PhaladharaPanchadhara #TempleNews #SpiritualEvents #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube