BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 08:08 pm
Posted by : కూనురు మధు

ట్రేడింగ్ దెబ్బ.. దొంగతనాల బాట ! పగటిపూట ఇళ్లకు కన్నం వేసిన యువకుడి అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
02 Sep, 2026 - 08:08 PM
366 వీక్షణలు


* వివరాలు వెల్లడించిన నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి


 ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయి అప్పుల పాలైన ఓ యువకుడు, వాటిని తీర్చేందుకు పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతూ నార్కట్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు రూ.22.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, ఐరన్ కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి కేసు వివరాలను వెల్లడిస్తూ నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామానికి చెందిన గేగు పద్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 24న బంధువుల ఇంట్లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకకు వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాము అలియాస్ జయరాంరెడ్డి (29)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన రాము, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.


గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలకు కుటుంబాలు వెళ్లిన సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పగటిపూట చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. ఐరన్ కట్టర్‌తో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదును అపహరించేవాడని వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2న ఉదయం నార్కట్‌పల్లి–అమ్మనబోల్ ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఐరన్ కట్టర్, బంగారం, వెండి ఆభరణాలు, నగదు లభించడంతో విచారించగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 9 చోరీ కేసులకు పాల్పడినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో 12 తులాల బంగారు ఆభరణాలు (విలువ రూ.19.20 లక్షలు), 16 తులాల వెండి వస్తువులు (విలువ రూ.40 వేలు), రూ.2.50 లక్షల నగదు,  ద్విచక్ర వాహనం  ఐరన్ కట్టర్ ఉన్నాయి. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన నార్కట్‌పల్లి సీఐ సురేష్, ఎస్‌ఐ విష్ణుమూర్తి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.