BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:25 PM
135 వీక్షణలు

తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ జాగృతి సంస్థ ప్రజా బడ్జెట్‌ను ప్రకటించింది. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ భారీ కేటాయింపులు ప్రతిపాదించింది.

విద్యారంగానికి రూ.30 వేల కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించాలని సూచించింది. యూనివర్సిటీ విద్యాభివృద్ధికి రూ.2 వేల కోట్లు ప్రతిపాదించింది. వృద్ధులు, వికలాంగులు సహా ఇతర పింఛన్ల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని పేర్కొంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ల కోసం రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని సూచించింది.

యువత సాధికారత కోసం 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీల పంపిణీకి రూ.5 వేల కోట్లు, 16 లక్షల మంది యువతకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా సాయం అందించేందుకు రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించేందుకు రూ.35 వేల కోట్లు కేటాయించాలని పేర్కొంది.

సామాజిక న్యాయం దిశగా బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు, ఎస్సీలకు రూ.18 వేల కోట్లు, ఎస్టీలకు రూ.10 వేల కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది.

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం అందించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సూచించింది. ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.10 కోట్లు ప్రతిపాదించింది.

అదేవిధంగా, 50 ఏళ్లు నిండిన కళాకారులకు పెన్షన్ పథకం కింద లక్ష మందికి సాయం అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక సంక్షేమం దిశగా ఈ ప్రజా బడ్జెట్ ఉపయోగపడుతుందని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు.