BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:16 PM
114 వీక్షణలు

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మ ఆశీర్వాదం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని సీనియర్ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన డీకే శివకుమార్.. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కనబెట్టి అందరి అనుభవాన్ని వినియోగించుకుంటానని తెలిపారు.

ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయగా, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయగా, మరో 13 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌గా హెచ్‌కే పాటిల్ బాధ్యతలు చేపట్టనుండగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరయ్యారు.

లోక్ భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు డీకే శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.