BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 01:20 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూర్ పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 01:20 PM
105 వీక్షణలు

తొర్రూర్ పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా


తొర్రూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు..

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించిన మహానేత అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు..

అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, విద్య మరియు చైతన్యం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, స్థానిక వార్డు కౌన్సిలర్ పెద్దగాని కళావతి సోమన్న, తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమరాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,వార్డు కౌన్సిలర్లు ముద్దసాని సురేష్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..