BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 08:53 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

తప్పుడు వార్తలను నమ్మకండి పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత లేదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Mar, 2026 - 08:53 AM
179 వీక్షణలు

తప్పుడు వార్తలను నమ్మకండి పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత లేదు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు--జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (LPG) కొరత లేదు – భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రోజున అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  జిల్లాలోని సేల్స్ ఆఫీసర్స్ మరియు  పెట్రోల్ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా నో - స్టాక్ బోర్డులు పెట్టకూడదని, ముందస్తు స్టాక్ బుకింగ్ చేసుకోవాలని, స్టాక్ 24 గంటలలో డెలివరీ చేయాలని సేల్స్ ఆఫీస్సర్లకు సూచించారు మరియు పెట్రోల్ బంకులలో మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు జిల్లాలో ఎక్కడా కూడా  పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత లేదని, ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా,సక్రమంగా పని చేస్తుందన్నారు.జిల్లా ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కొన్ని పెట్రోల్ బంకులలో తాత్కాలిక “No Stock” బోర్డులు కనిపించడం, తప్పు వదంతుల వల్ల ప్రజలు panic లో ఇంధనం కొనుగోలు చేయడం వల్లనే జరుగుతుంది. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా ఎక్కువ ఇంధనం కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 – 3 రెట్లు విక్రయాలు పెరిగాయి. పెట్రోల్ లేదా డీజిల్ ను డబ్బాలు / క్యాన్లలో నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధం. ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు. అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెట్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు ఓఎంసీ ల అడ్వాన్స్ పేమెంట్  మార్పుల వల్ల స్థానిక డీలర్లకు తాత్కాలిక సమస్యలు మాత్రమే ఏర్పడ్డాయి, సరఫరాలో లోపం లేదు అని అన్నారు అదనపు కలెక్టర్ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు భయాందోళనలతో ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు అని,తమకు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయండి అని అన్నారు ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మకండి / ఇతరులకు పంపకండి అని జిల్లా ప్రజలకు సూచించారు