BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 29 January 2026, 08:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
29 Jan, 2026 - 08:27 AM
420 వీక్షణలు
  నామినేషన్‌ల స్వీకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు అధికారులను ఆదేశించారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్న వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారం జరుగుతోందా లేదా అని సమగ్రంగా తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్కులు, అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ పత్రాలకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు పూర్తిగా ఉన్నాయా లేదా తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోజువారీ ఎన్నికల నివేదికలను T-Poll యాప్‌లో వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. #MunicipalElections #NominationProcess #ElectionDuty #DistrictCollector #YadadriBhuvanagiri #ElectionCommission #TransparentElections Follow us on Website Facebook Instagram YouTube