BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 January 2026, 08:10 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

కంపెనీ అనుమతులు రద్దు చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 08:10 PM
209 వీక్షణలు
నూతన క్రషర్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: ఎమ్మెల్యేకు గోవింద్ తండా గ్రామస్తుల వినతి NTODAY NEWS: బొమ్మలరామారం మాదాపూర్ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 262లో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఎన్సీఎల్ లిమిటెడ్ క్రషర్ మిషన్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని గోవింద్ తండా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోవింద్ తండా నాయకులు, యువకులు, వార్డు సభ్యులు కలిసి గోవింద్ తండా సర్పంచ్ ధీరవత్ మంగ్త్య నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధీరవత్ మంగ్త్య నాయక్ మాట్లాడుతూ, మాదాపూర్ రెవెన్యూ శివారులోని భూములు తమ తాత–ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న క్రషర్ మిషన్ వల్ల ఏర్పడుతున్న దుమ్ము కాలుష్యంతో పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మరో కొత్త క్రషర్ మిషన్‌కు అనుమతి ఇవ్వడం వల్ల వ్యవసాయ భూములు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి గిరిజన రైతుల జీవనాధారమైన భూములను కాపాడాలంటే నూతన క్రషర్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, అనుమతుల నిలుపుదల అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడతానని, గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవింద్ తండా నాయకులు ధీరవత్ రవీందర్ నాయక్, ధీరవత్ బిక్కు నాయక్, ధీరవత్ రాజేష్ నాయక్, మాలు నాయక్, ధీరవత్ నవీన్ నాయక్, హచ్య నాయక్, బాలు నాయక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. #CrusherIssue #EnvironmentalConcern #FarmersRights #TribalIssues #StopPollution #SaveAgriculture #LocalProtest #Bommalaramaram #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube