స్వామివారిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్
తెలంగాణ
భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ వేములవాడ: వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే వెళ్లగా ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్, ఎస్పీతో పాటు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభాయ్‌లకు అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.
ఏర్పాట్ల పరిశీలన
సమ్మక్క–సారలమ్మ జాతర, మహా శివరాత్రి నేపథ్యంలో ఆలయంలో తాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్ స్నానాల ఏర్పాట్లు, కోడె మొక్కుల టికెట్ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు, నీటి సరఫరా ఏర్పాట్లను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు.
బద్ది పోచమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పనులు పూర్తి చేసి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.
భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube