BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం

తెలంగాణ
08 Feb, 2026 - 05:53 AM
86 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో ఘనంగా ప్రారంభం 11 రోజుల పాటు ఆగమశాస్త్ర పద్ధతుల్లో ఉత్సవాలు NTODAY NEWS: శ్రీశైలం శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు (ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు) నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ముందుగా యాగశాల ప్రవేశం నిర్వహించారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్ప పఠనం (శివసంకల్పం) చేశారు. ఈ సందర్భంగా దేశంలో శాంతి, సౌభాగ్యం, సకాలంలో వర్షాలు, పంటల సమృద్ధి, ప్రజల ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. గణపతి పూజ అనంతరం పుణ్యాహవచనం నిర్వహించారు. తరువాత చండీశ్వర పూజ జరిపి, బ్రహ్మోత్సవాలు చండీశ్వరుని నాయకత్వంలో, వీరభద్రుని పర్యవేక్షణలో జరుగుతాయని ఆగమ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. కంకణ పూజ, కంకణధారణ అనంతరం ఋత్విగ్వరణం నిర్వహించి, వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఋత్విక్కులను ఆహ్వానించారు. తదుపరి అఖండదీప స్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం మండపారాధన చేసి రుద్ర కలశ స్థాపన, కలశార్చన, పంచావరణార్చనలు జరిపారు. లోకకల్యాణార్థం జపానుష్ఠానాలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. యాగశాలలో మృత్సంగ్రహణం చేసి, నవధాన్యాలతో పాలికల్లో అంకురార్పణ చేశారు. ఈ అంకురాలు దినదినాభివృద్ధి చెందాలని చంద్రుని అధిపత్యంలో ప్రార్థనలు చేశారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం విశేషంగా జరిగింది. నంది ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరించి, భేరీపూజ, నాదస్వర ఆలాపనలతో దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ ధ్వజారోహణతో సకల దేవతలు క్షేత్రానికి ఆహ్వానితులవుతారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం జారీ చేసిన ప్రకటన) #MahaShivaratri #Srisailam #Brahmotsavams #ShaivaTradition #TempleFestivals #SpiritualIndia #AgamaShastra Follow us on Website Facebook Instagram YouTube