BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 February 2026, 08:28 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

తెలంగాణ
06 Feb, 2026 - 08:28 PM
390 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం: హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO) కీలక పాత్ర పోషించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. శుక్రవారం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, అలాగే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన PO, APO శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సూచనలు: పోలింగ్ సామగ్రి ఉదయం 8 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఉండేలా చూసుకోవాలి. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సరిగ్గా వచ్చాయా లేదా ముందుగానే తనిఖీ చేయాలి. బ్యాలెట్ బాక్సులు సక్రమంగా ఓపెన్ అవుతున్నాయా లేదా పరీక్షించాలి. స్వస్తిక్ గుర్తు, మున్సిపాలిటీ స్టాంపులు పూర్తిగా ఉన్నాయా లేదో నిర్ధారించాలి. ప్రతి ఓటరు తన ఓటును సరైన విధంగా బ్యాలెట్ బాక్సులో వేస్తున్నాడా లేదా పర్యవేక్షించాలి. పోలింగ్ రోజున సమయపాలన పాటిస్తూ, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ పూర్తయ్యాక సామగ్రిని జాగ్రత్తగా రిసెప్షన్ కౌంటర్లలో అప్పగించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు, POలు, APOలు తదితరులు పాల్గొన్నారు. #MunicipalElections #TransparentElections #ElectionDuty #PresidingOfficer #YadadriBhuvanagiri #TelanganaElections #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube