BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా ఏలూరు ప్రజలకు లబ్ధి

తెలంగాణ
09 Mar, 2026 - 04:38 AM
163 వీక్షణలు
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా ఏలూరు ప్రజలకు లబ్ధి 58 మందికి రూ.32 లక్షల పైగా సహాయం అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అవసరార్థులకు ఎటువంటి ఆలస్యం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 58 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.32,07,513 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అదేవిధంగా రూ.2,21,727 విలువైన ఒక ఎల్‌వోసి (LOC) కాపీని కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. కేవలం 20 నెలల కాలంలోనే రూ.5,05,39,612 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలోని బాధితులకు అందించి వారికి భరోసా కల్పించామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు కోట్లాది రూపాయల సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది బాధితులకు సహాయం అందించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. #CMRF #Eluru #BadetiChanti #ChandrababuNaidu #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube