BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 February 2026, 07:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నేటి యువతకు ఆదర్శం

తెలంగాణ
07 Feb, 2026 - 07:56 AM
300 వీక్షణలు
శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నేటి యువతకు ఆదర్శం తిమ్మమ్మ మర్రిమాను వద్ద విగ్రహ ఆవిష్కరణలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పిలుపు NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంగణంలో శ్రీ తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకృష్ణ దేవరాయల ఘనకీర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా సాగిన ఆయన పరిపాలన నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేవాలయాల నిర్మాణం, దుర్భేద్యమైన కోటలు, సాగునీటి చెరువులు, బావుల తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చక్రవర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని వివరించారు. అంతటి గొప్ప పాలకుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా శ్రీకృష్ణ దేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించి, రాయలసీమను “రతనాల సీమ”గా భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాల సమయంలో గ్రామస్థులు చేసిన పోరాటానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అండగా నిలిచిందని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల నుంచి నేడు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి అధ్యక్షుడు గంగరాజు లేపాక్ష, కమిటీ సభ్యులు, అలాగే తిమ్మమ్మ మర్రిమాను, గూటిబైలు, మేకలచెరువు గ్రామ ప్రజలను రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున అభినందించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎం.ఆర్.జయరాం, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, జనసేన రాయలసీమ సమన్వయకర్త మతి దారం అనిత, వివిధ కుల సంఘాల నాయకులు, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్లు, యూత్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. — లక్ష్మణ కూటాల రాయల్ పీపుల్స్ ఫ్రంట్, రాయలసీమ యూత్ వింగ్ కన్వీనర్ #SriKrishnaDevaraya #VijayanagaraEmpire #RayalaseemaHeritage #IndianHistory #YouthInspiration #CulturalPride #ThimmammaMarrimanu #RoyalPeoplesFront Follow us on Website Facebook Instagram YouTube