BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 February 2026, 11:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ

తెలంగాణ
15 Feb, 2026 - 11:47 PM
180 వీక్షణలు
ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ – శ్రీశైలంలో మహాశివరాత్రి వైభవం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ ఘనంగా నిర్వహించబడింది. లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. చీరాల వాసి పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబానికి చెందిన పృథ్వి సుబ్బారావు భక్తిశ్రద్ధలతో 365 రోజుల పాటు ప్రతిరోజూ ఒక మూర చొప్పున నేత నేసి సిద్ధం చేసిన పాగాను స్వామివారికి సమర్పించారు. ఆలయ సంప్రదాయ పద్ధతులనుసరించి సుమారు రెండు గంటల పాటు పాగాలంకరణ నిర్వహించబడింది. ఈ సందర్భంగా భక్తులు ఏకస్వరంతో శివనామస్మరణ చేస్తూ క్షేత్రాన్ని మారుమోగించారు. అనంతరం నాగలకట్ట సమీపంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఉత్సవ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. #Srisailam #Mahashivaratri #Pagalankarana #Rudrabhishekam #TempleFestival #NandyalNews Follow us on Website Facebook Instagram YouTube