BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 January 2026, 09:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దాడులను ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ
04 Jan, 2026 - 09:23 AM
399 వీక్షణలు

వెనిజులాపై అమెరికా దాడులను ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

-సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన NTODAY NEWS: హైదరాబాద్, రిపోర్టర్ పగడాల దేవయ్య సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను ఖండిస్తూ శనివారం చంద్రయాణగుట్టలోని ఫలకనుమా చౌరస్తా వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనిజులాలో అధికార మార్పు కోసం అక్కడి మధురో ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నాలను అమెరికా గత కొన్ని రోజులుగా చేస్తున్నదని ఆరోపించారు. వెనిజులా చుట్టూ అమెరికా సైన్యాన్ని మోహరించడం ఉద్దేశ్యపూర్వక చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. వెనిజులా అధ్యక్షుడు మధురోను, ఆయన సతీమణిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాద దేశమైన అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందని అన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు దేశాలు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయని, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని అమెరికాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చంద్రయాణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్. కిషన్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మమ్మ, ఏ. కృష్ణ, శ్రీను, స్వామి, సోమ్మన్న, విర్రన్న, గౌజ్, యాదయ్య, కుమార్, తుపాకీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube