BREAKING
​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గుంటుక యాకమ్మను పరామర్శించిన కంటాయపాలెం గ్రామ సర్పంచ్ ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గుంటుక యాకమ్మను పరామర్శించిన కంటాయపాలెం గ్రామ సర్పంచ్
www.ntodaynews.com

​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 07:58 PM
65 వీక్షణలు

క్షతగాత్రులను కాపాడితే పారితోషకం.. నిర్దేశిత ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం

​జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డిసిపి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్.టి.సి., విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 'రాహ్ - వీర్' కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులపై ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి కాపాడే వారికి ప్రభుత్వం ద్వారా పారితోషకం అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 'రహత్' పథకం కింద 4 ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ప్రభుత్వాసుపత్రి, చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మరియు మెడిలైఫ్, టచ్, అభయ, ఆరోగ్యశ్రీ ప్రైవేటు ఆసుపత్రులలో క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందిస్తామని వెల్లడించారు.

​మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై తక్కువ ఎత్తు గల బీమ్‌లు, తక్కువ విజిబిలిటీ ఉన్న చోట్ల లైటింగ్, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదుపు తప్పిన, ఓవర్ లోడెడ్, పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలపై నిఘా ఉంచాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేయాలని, వారి వివరాలు మరియు ఓవర్ లోడింగ్ వాహనాల వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు.

​రహదారులపై కేజ్ వీల్స్, ట్రాక్టర్ కేజ్ వీల్స్ వినియోగాన్ని నిలిపివేసేందుకు మరియు ఓవర్ లోడింగ్, మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లపై ప్రతి మండల, గ్రామాల పరిధిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రహదారులపై సంచరించే పశువులను గోశాలకు తరలించాలని, అంతర్గత రహదారులలో కల్వర్టుల దగ్గర సూచికలు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల బెడదను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు