BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 20 March 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:49 PM
189 వీక్షణలు

వాట్సాప్‌లో సంచలన మార్పులు… ఫోన్ నంబర్‌కు గుడ్‌బై?

అంతర్జాతీయంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్స్, యునిక్ ఐడీలను ప్రవేశపెట్టే దిశగా సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే జూన్ నెలలో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పుతో యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండా కొత్త వ్యక్తులతో, గ్రూపులతో కనెక్ట్ కావచ్చని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలనుకునే వారికి ఫోన్ నంబర్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్లు అందుబాటులో ఉంచనున్నారు.

ఇక మరో కీలక పరిణామంగా, వాట్సాప్ యాప్ లేని వ్యక్తులతో కూడా చాట్ చేసే విధంగా ‘గెస్ట్ చాట్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే కమ్యూనికేషన్ వ్యవస్థలో మరింత విస్తరణ కలగనుంది.

ఈ మార్పులు అమల్లోకి వస్తే, యూజర్ల ప్రైవసీ రక్షణతో పాటు, డిజిటల్ కమ్యూనికేషన్‌లో కొత్త దశ ప్రారంభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.