ఎమ్మెల్యేను కలిసిన ఉరుమడ్ల నాయకులు
ప్రజా వికాస సభలో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఉరుమడ్ల నాయకులు
మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, వార్డు సభ్యుడు హరిప్రసాద్‌రెడ్డి
నకిరేకల్ | Ntoday News
నకిరేకల్‌లో నిర్వహించిన ప్రజా వికాస సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన సందర్భంగా ఉరుమడ్ల గ్రామానికి చెందిన నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, 5వ వార్డు సభ్యుడు హరిప్రసాద్‌రెడ్డి, నడింపల్లి గోపాల్, పరమేశం తదితరులు ఎమ్మెల్యే వేముల వీరేశంతో సమావేశమయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై నాయకులు ఎమ్మెల్యేతో చర్చించినట్లు తెలిపారు. ప్రజా వికాస సభకు ముఖ్యమంత్రి హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.