BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీ సీనియర్ నాయకుడు చింతల భాస్కర రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:34 AM
75 వీక్షణలు

వైసీపీ సీనియర్ నాయకుడు చింతల భాస్కర రెడ్డి కన్నుమూత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కర రెడ్డి విజయవాడలో చికిత్స పొందుతూ శివైక్యం చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని నరసాపురంలోని స్వగృహ ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చింతల భాస్కర రెడ్డి మృతి నరసాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఆయనకు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.