BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:49 PM
192 వీక్షణలు

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ: తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

కారుణ్య నియామకాల విషయంలో వివాహిత కుమార్తెలను అనర్హులుగా పరిగణించడం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య నియామకానికి అర్హులేనని పేర్కొంది.

కేవలం వైవాహిక స్థితి ఆధారంగా మహిళల హక్కులను పరిమితం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. కుటుంబంపై ఆధారపడే స్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిందే గానీ, వివాహిత అనే కారణంతో అవకాశాలను నిరాకరించరాదని వెల్లడించింది.

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న పలువురు వివాహిత కుమార్తెలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.