BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:10 PM
47 వీక్షణలు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు-- రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంక రెడ్డి

యాసంగి 2025-26  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో,ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశం మందిరంలో 2025-2026, యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం  రెవిన్యూ అదనపు కలెక్టర్  వెంకా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు(IAS) , సంబంధిత అధికారులతో వరి కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు శిక్షణ తరగతులు  కలెక్టరేట్ లో  నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులందరూ టార్పాలిన్ కవర్లు ఎక్కువగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐకెపి, సమ భావన సంఘాల సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా సుమారు ( 330) కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, అందుకోసం జిల్లా స్థాయి దాన్యం కొనుగోళ్ల కేంద్రాల కమిటీ ద్వారా ప్రభుత్వం సూచించిన ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ ద్వారా స్వీకరించి కేంద్రాలకు వచ్చే దాన్యం పూర్తి వివరాలు డాటా ఎంట్రీ లో పొందుపరచాలన్నారు. కొనుగోలు రవాణా, డ్రై మిషన్,ప్యాడి క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, మాయిశ్చర్స్ ,ఆటోమేటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.కేంద్రాలలో గన్ని సంచులు, అవసరానికి అనుగుణంగా ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో కనీస వసతులైన మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.ప్యాడి సెంటర్లను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతిరోజు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి దాన్యం డబ్బులను రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.వరి ధాన్యం క్వింటాలకి ' ఏ ' గ్రేడ్ కు రూ.2389/-, సాధారణ రకం క్వింటాలకి 2369/- చొప్పున  ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని రోజారాణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరికృష్ణ, డిఆర్డిఓ నాగిరెడ్డి,డిసిఓ మురళి,డిఏఓ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.