BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 07:37 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:37 AM
136 వీక్షణలు

వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలి, అధికారులను ఆదేశించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు  మంగళవారం రోజున మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో-ఆపరేటివ్, మిల్లర్లు తదితర శాఖల అధికారులతో రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్  సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలన్నారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా త్రాగునీరు కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.కేంద్రాలకు ఏ రోజు వచ్చే ధాన్యం అదే రోజు కొనుగోలు జరిగి, అదేరోజు  మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు  లోడింగ్ ధాన్యం ను వెంటనే తీసుకోవాలన్నారు.ధాన్యం కొనుగోలుకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలన్నారు.అలాగే టార్ఫాలిన్లు,ధాన్యాన్ని తూర్పార పట్టే యంత్రాలు,గన్నీ సంచులు,వెయింగ్ మెషీన్ లు,తదితర పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాలలో సరిపడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలన బృందాల చే ఆకస్మిక తనిఖీలు చేపట్టి కొనుగోలు ప్రక్రియ ను పర్యవేక్షణ చేయాలన్నారు ఈ సమావేశంలో  రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,సివిల్ సప్లై మేనేజర్ హరి కృష్ణ, జిల్లా గ్రామీణ  అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ  అధికారి రమణ రెడ్డి, జిల్లా తూనిక, కొలతల అధికారి వెంకటేష్, జిల్లా కోపరేటివ్ అధికారి మురళి, మిల్లర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.