BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ పశ్చిమలో అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 07:11 PM
6 వీక్షణలు

పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు ప్రాధాన్యత.. రూ.90 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం

వరంగల్ | Ntoday News

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గతంలో సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

శనివారం నియోజకవర్గ పరిధిలోని 52వ డివిజన్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వెనుక ప్రాంతంలో, అలాగే 6వ డివిజన్‌లోని పద్మశాలీవాడలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం సుమారు రూ.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో 52వ డివిజన్‌కు రూ.60 లక్షలు, 6వ డివిజన్‌కు రూ.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకోవడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.

ప్రతి కాలనీకి మౌలిక వసతులు

నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా అంతర్గత రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

గత పదేళ్లలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలను గుర్తించి ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రతి కాలనీలో మెరుగైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అభివృద్ధి ప్రధాన రహదారులు, కూడళ్లకే పరిమితం కాకుండా ప్రతి కాలనీకి, ప్రతి వీధికి చేరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. చేపడుతున్న పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకురావడంతో పాటు స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెరిగిందని, గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.