BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 11:38 am
Posted by : V శ్రీనివాస్

వృత్తి కులాల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలి

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 11:38 AM
237 వీక్షణలు

మంచిర్యాల (MNCL):

రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తి కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.25 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కేంద్రంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కులవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

​పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల ప్రభావం వల్ల సుమారు 25 లక్షల మంది కులవృత్తిదారులు తమ జీవనోపాధిని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయిస్తే, ఆయా వృత్తులను ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా వృత్తిదారులు గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.