BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు

తెలంగాణ
25 Jul, 2025 - 06:13 AM
224 వీక్షణలు
ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంలో మరో కీలక చర్యగా ముందుకొచ్చారు. NTODAY NEWS: ఏలూరు, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్న ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి యొక్క సిబ్బంది సదరు సైలెన్సర్లను ధ్వంసం చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారి ఆదేశాలపై, ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మణరావు నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు ఏలూరు పట్టణంలో నిరంతర గస్తీ నిర్వహిస్తూ, అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి, వారి సైలెన్సర్ల ను తొలగించి సదరు అక్రమ సైలెన్సర్లను శుక్రవారం  ధ్వంసం  చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృద్ధులు గుండె జబ్బులు కలిగినటు వంటి వారు ఇతర జబ్బులు కలిగినటువంటి వారు శబ్ద కాలుష్యం పెను ముప్పుగా మారిందని, దీనిని కలిగించే మారప్పుపడి సైలెన్సర్లను వాడుతున్న వాహనదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 🔹 వాహన దారులు వాహన తయారీ కంపెనీ సూచించిన ఒరిజినల్ సైలెన్సర్లు మాత్రమే ఉపయోగించాల్సిందిగా సూచించారు. 🔹 ద్విచక్ర వాహనాల యొక్క నెంబర్ ప్లేట్ పై నాన్-అథరైజ్డ్ స్టికర్లు, నెంబర్ ప్లేట్లు ఉంచడం వల్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు. 🔹 హెల్మెట్ ధరించడం వాహనదారుల ప్రాణాలను కాపాడే ప్రాథమిక భద్రతా చర్యగా పేర్కొన్నారు. 🔹 మద్యం సేవించి వాహనాలు నడిపే వారు కేవలం తమకే కాకుండా, ఎదుటి వారి ప్రాణాలకు కూడా హానికరం అనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలపై మమకారంతో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి వారు కాలేజీలకి వెళ్లి రావడానికి ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది సదరు విషయాలపై తల్లిదండ్రులు పిల్లల యొక్క మోటార్ సైకిళ్ళు ఏ విధముగా మార్పులు చేర్పులు చేస్తున్నారని విషయాలను గమనించాలని, ప్రజలు చట్టాలను గౌరవించి, ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తేనే సమాజంలో భద్రత వాతావరణం నెలకొంటుందని, ఏలూరు పట్టణంలో చిరు వ్యాపారాలు చేసేవారు ట్రాఫిక్ కి అవరోధాలు కల్పించకుండా వారు వ్యాపారాలను కొనసాగించుకోవాలని కోరారు.  ట్రాఫిక్ పోలీసు వారికి ప్రజలందరూ సహకరించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని, ఆటో డ్రైవర్లు ఆటోలను నడిపే సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని దాని వలన వారికే కాకుండా ఎదుటివారికి కూడా రక్షణ కలిగే విధంగా ఉంటుందని గమనించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube