BREAKING
తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు నివాళి అర్పణ ఎండల తీవ్రత నాగర్ కర్నూల్ ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు చల్లని కబురు ఈసారి ముందుగానే రుతుపవనాలు జగిత్యాలలో శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు నివాళి అర్పణ ఎండల తీవ్రత నాగర్ కర్నూల్ ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు చల్లని కబురు ఈసారి ముందుగానే రుతుపవనాలు జగిత్యాలలో శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల
www.ntodaynews.com

ప్రజా పాలనలో భాగంగా అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు

తెలంగాణ
18 Jul, 2025 - 08:01 AM
131 వీక్షణలు
ప్రజా పాలనలో భాగంగా అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు-- ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య NTODAY NEWS: యాదగిరిగుట్ట అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం రోజున ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు అహార భద్రత కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ... ప్రజా పాలన లో భాగంగా అర్హులైన లబ్దిదారులకు ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 5,600 రేషన్ కార్డులు మంజూరీ చేయడం జరిగిందని,15,632 యూనిట్లు మొత్తం 18,640 మంది సుమారు ఆలేరు నియోజకవర్గంలోనే 36 వేల మందికి 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యంతో పేద వారు అన్నం తినకుండా బియ్యం దళారులకు అమ్ముకునేవారు,ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన మేరకు పేదవారు కడుపునిండా అన్నం తినాలనే సంకల్పనతో ముఖ్యమంత్రి ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం ప్రతి పేదవారు సన్న బియ్యంతో కడుపునిండా తినాలని గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు.ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు, మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు జమ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళలు కాంట్రాక్టర్ గా మారి నిర్మాణాలు చేపట్టారన్నారు. పలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్,పెట్రోల్ బంకులు,అద్దె బస్సులు,స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం అవడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.మహిళ సంఘాలకి లోన్ భీమా,ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెల లోనే రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. భారతదేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతులు సన్న రకం వడ్లు పండించిన వారికి 500 రూపాయలు బోనస్ ఇచ్చామన్నారు. అవే సన్న బియ్యం రైస్ మిల్లులకు తరలించి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా పెళ్లయిన, పిల్లలు పుట్టిన వారిని రేషన్ కార్డులు చేర్చాలంటే అనుమతించలేదని ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులో లబ్ధిదారులు నమోదుకు నిరంతర ప్రక్రియగా చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో అమలవుతున్నాయన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేషన్ కార్డు అనేది ఒక చిరకాల కోరిక అని అన్నారు.రేషన్ కార్డులో కొత్తగా కుటుంబసభ్యుల పేరు నమోదు చేసుకోవాలన్న ప్రక్రియ గతంలో లేదని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త వారిని రేషన్ కార్డులు నమోదు చేయడానికి నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.ప్రతి పేద వారు కడుపు నిండా సన్న బియ్యం తిన్నాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గొప్ప కార్యక్రమం చేపట్టిందన్నారు.అర్హులైన ప్రతి దారులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. జిల్లాలో 1/4 శాతం ఆలేరు నియోజకవర్గ లబ్ధిదారులకే కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే తొందరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేపడుతారో వారికి ఆలేరు శాసనసభ్యులు నూతన వస్త్రాలు గొర్రె పొట్టేలు అందించడం ఎంతో అభినందనీయం అని అందుకు ప్రతి ఒక్కరు వారికి కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులలో భాగంగా అర్హులైన ప్రతి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తదనుగుణంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కొత్తగా పెళ్లి అయిన వారు,నమోదు చేసుకోవాలన్న పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలన్నా ,ఇంకా ఎవరైనా చేసుకోపోతే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి,ఆలేరు,మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్ లు ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి,విమల వెంకటేష్,ఆర్డీఓ కృష్ణారెడ్డి,ఆలేరు నియోజకవర్గం తహసీల్దార్ లు, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube