BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 04 June 2026, 09:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:06 PM
183 వీక్షణలు

యూకే ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు.. ‘నందూస్ వరల్డ్’ దంపతులపై కేసు నమోదు

యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామంటూ భారీ మొత్తాలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్పై కేసు నమోదైనట్లు సమాచారం.

గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపును ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు నిర్వహించి విదేశీ ఉద్యోగాలు, వీసా సేవలు అందిస్తామని చెప్పి కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు, వీసా రెన్యూవల్ మరియు తన భార్యకు ఉద్యోగం కోసం CoS ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. 2023లో నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది నవంబరులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు, మధుకర్‌ను A1గా, రమానందనను A2గా, మోహన్‌రావును A3గా చేర్చినట్లు సమాచారం. నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదని ప్రచారం జరుగుతోంది.

కేసును కొట్టివేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా తమను బాధితులమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై కోర్టు తుది తీర్పు వెలువడాల్సి ఉంది.