BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

11 మంది మావోయిస్టులు లొంగుబాటు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:36 PM
144 వీక్షణలు

11 మంది మావోయిస్టులు లొంగుబాటు

గడ్చిరోలి, మార్చి 19 : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో డివిజనల్ కమిటీ మెంబర్ (డీవీసీఎం), ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి కీలక నేతలు కూడా ఉన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పునరావాస, సమాధాన చర్యల ఫలితంగా మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా, 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు.