BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 01 May 2026, 02:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:16 PM
148 వీక్షణలు

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పేదలకు ధీమా ఇచ్చే పథకం అని పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు వ్యాఖ్య

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేద ప్రజలు ధీమాగా జీవిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్‌గా రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 అందిస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు.

పేద కుటుంబాలకు చంద్రబాబు పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, గద్ధల ఆంటోనీ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.