BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 10:28 pm
Posted by : NTODAY NEWS

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 10:28 PM
164 వీక్షణలు

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు -మరిపెడ సీఐ పవన్ కుమార్

మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని మరిపెడ సీఐ పవన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మరిపెడ మండలంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రగ్స్ టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.మాదక ద్రవ్యాలు సేవించడం, విక్రయించడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎస్సై గండ్రతి సతీష్, సెకండ్ ఎస్సై మహబూబి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.