BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 10:19 pm
Posted by : V శ్రీనివాస్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిల్లా వాసులకు కలెక్టర్ అభినందనలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 10:19 PM
273 వీక్షణలు

తల్లి–కూతుళ్ల ప్రతిభకు ప్రశంసలు.. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు

మంచిర్యాల, జూన్ 6: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మే 29న నిర్వహించిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించిన జిల్లా వాసులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో గిన్నిస్ రికార్డు సాధించిన బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్‌లను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్న గిన్నిస్ అచీవర్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషమన్నారు. అందులో మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లి–కూతుళ్లు బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్ ఎంపికై గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. వారి ప్రతిభ మరెంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాజలింగు తదితరులు పాల్గొన్నారు.