BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 April 2026, 05:14 pm
Posted by : V శ్రీనివాస్

ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 05:14 PM
186 వీక్షణలు

ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

మంచిర్యాల: ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి మిత్ర పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో వేంపల్లిలోని ఎస్.ఆర్.కె.ఎం నర్సింగ్ కళాశాలలో భూగోళ సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా భూగర్భ జల శాఖ అధికారి వేముల సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను కాపాడాలని కోరారు. అటవీ అభివృద్ధి సంస్థ మేనేజర్ గోగు సురేష్ కుమార్, కళాశాల కరస్పాండెంట్ పోటు తిరుపతిరెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించగా, కార్యక్రమంలో ఆరోగ్యశాఖ హెచ్.ఈ.ఓ జి.నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్, పర్యావరణ ప్రేమికులు మోతే శరత్ చంద్ర, రాజశేఖర్, కుమ్మరి కళాకారులు రాజేంద్రప్రసాద్, సిబ్బంది యుగంధర్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు మట్టి పాత్రలను అందజేసి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం బట్ట సంచులను వాడాలని పిలుపునిచ్చారు