BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 30 March 2025, 03:39 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యాదగిరిగుట్టలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

తెలంగాణ
30 Mar, 2025 - 03:39 AM
385 వీక్షణలు
N TODAY NEWS: యాదగిరిగుట్ట మండలం, మార్చ్ 30 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా యాదగిగుట్ట ఆలయ అర్చకులచే శ్రీ విశ్వక్సేన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పంచాంగ శ్రవణాన్ని పఠనం చేసారు.ఈ కార్యక్రమంలో బీర్ల అయిలయ్య దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పట్టం కడుతూ జరుపుకునే పండుగ ఉగాది పండుగ అన్నారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నలుమూలల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని, ప్రముఖ దేవాలయాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని. ఈ నేపథ్యంలో యాదిగిరిగుట్టలోని తమ స్వగృహంలో కూడా ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించామని బీర్ల అయిలయ్య అన్నారు..ఈ సంవత్సరం రైతులకు మంచి రోజులు రానున్నాయని ఇటు పకృతి పరంగా ప్రభుత్వం పరంగా రైతులకు మంచి జరుగుతుందని ఆశించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా సమృద్ధిగా కురుస్తాయని, ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని బీర్ల ఐలయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు,యాదగిరిగుట్ట మండల, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు