BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Apr, 2026 - 10:20 AM
159 వీక్షణలు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే!

​నగునూర్ గ్రామ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు

​పేద మహిళ ఆవేదన: పట్టించుకోని ఉన్నతాధికారులు

​సారంగాపూర్, ఏప్రిల్ 25 (ఎన్ టుడే న్యూస్):

ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఆ మహిళకు వరం కావాల్సింది పోయి శాపంగా మారింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి సిబ్బంది అవినీతి దాహానికి ఒక పేద కుటుంబం బలైపోతోంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

​అసలేం జరిగిందంటే:

నగునూర్ గ్రామానికి చెందిన రేంగుంట గంగమ్మ (భర్త రాజు) అనే నిరుపేద మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా "ముగ్గు పోసిన ఫోటోలు అప్‌లోడ్ చేయాలి" అనే చిన్న పని కోసం గ్రామ కార్యదర్శి ఆరిఫోద్దీన్ సదరు మహిళను 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

​అప్పుల ఊబిలో పేద కుటుంబం:

ఇంతకుముందే తన భర్త పేరు మీద ఉన్న స్థలాన్ని తన పేరు మీదకు మార్చుకోవడానికి గంగమ్మ 30 వేల రూపాయలు లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇంటి ఫోటోల కోసం మరో 50 వేలు అడగడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. "ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అండగా ఉంటే, అధికారులు ఇలా లక్షల్లో లంచాలు అడిగితే మేము ఎక్కడికి వెళ్లాలి?" అని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.

​ఒక సామాన్య పేద కుటుంబంపై రూ. 80 వేల భారం మోపడం వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేనని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, సదరు గ్రామ కార్యదర్శిపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.