BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 23 April 2026, 01:42 pm
Posted by : V శ్రీనివాస్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 01:42 PM
201 వీక్షణలు

​ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు – రైతుల పక్షాన పోరాట హెచ్చరిక

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేయడం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా విమర్శించారు.

గత కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సర్వత్రా జలకళ ఉట్టిపడేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఎల్లంపల్లి వంటి కీలక జలాశయాలను ఎడారిలా మారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేవలం మాటలకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను వంచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే రైతులకు భరోసా కల్పించకపోతే, సామాన్య జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు